ఏపీలో విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన మాట్లాడుతూ.. జులైలో వరదల వల్ల ప్రభావితమైన రైతులకు రూ.36 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలన్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండేళ్లలో ఉద్యాన పంటల ఉత్పత్తి పెంచాలని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.