నా చుట్టూ తిరగడం వల్ల పదవులు రావు: లోకేష్

77చూసినవారు
నా చుట్టూ తిరగడం వల్ల పదవులు రావు: లోకేష్
AP: మంత్రి నారా లోకేష్ చంద్రగిరి నియోజకవర్గ నేతలతో నేడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'పార్టీ కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటుంది. నా చుట్టూ తిరగడం వల్ల పదవులు రావు. పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయి. నాయకుల పని తీరుపై వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం, నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో బాధ్యతగా వ్యవహరించాలి' అని లోకేష్ అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్