గోపాలపురం: శ్రీవారి సేవలో మాజీ మంత్రి దేవినేని

ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారం కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు ఆలయమర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఈక్రమంలో ఆయన ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్