ఉంగుటూరు: మంత్రి దృష్టికి రైతుల సమస్యలు

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల & ఆహార వినియోగుదారుల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఉంగుటూరు నియోజకవర్గంలో రైతుల దగ్గర నుండి ధాన్యం సేకరణ సంబంధించిన విషయాలపై మంత్రితో చర్చించారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న ఇతర ప్రధాన సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకు వెళ్లారు.

సంబంధిత పోస్ట్