వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే ఒక్క జగనేనా?.. షర్మిల, విజయమ్మ కూడా ఉన్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదులుకున్నా. పవన్, చంద్రబాబు మెప్పు కోసం నేను మాట్లాడుతున్నానని విమర్శిస్తున్నారు. నేను ఎవరి మెప్పు కోసం పని చేయట్లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తిట్టే వాళ్లకే టికెట్లు ఇస్తామనే సంప్రదాయం ఎవరు కొనసాగిస్తున్నారో తెలుసు.’ అని అన్నారు.