పిఠాపురం: ప్రజలకు మేలు చేద్దామన్న అధికారులు ఉండటం అదృష్టం: పవన్

మంగళగిరి క్యాంపు కార్యాలయంలో గురువారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు. సర్పంచ్‌ల డిమాండ్లలో కీలకమైనవి గుర్తించి పూర్తి చేశామని ఆయన తెలిపారు. కేరళ అధికారి కృష్ణతేజను డిప్యూటేషన్‌పై తీసుకొచ్చామని అన్నారు. కృష్ణతేజ సహకారంతోనే గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. నా పేషీలో ప్రజలకు మేలు చేద్దామన్న అధికారులు ఉండటం నా అదృష్టమని పవన్ అన్నారు.

సంబంధిత పోస్ట్