కోచింగ్ సెంటర్లకు కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. తప్పుడు ప్రకటనలు ఇవ్వకూడదని, కోచింగ్ కేంద్రాలలో మౌళిక సదుపాయాలను కల్పించాలని, తక్షణ నిర్ణయం తీసుకునేలా అభ్యర్థులను ఒత్తిడికి గురిచేయొద్దని, ప్రతీ కోచింగ్ సెంటర్ నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌తో భాగస్వామ్యాన్ని కలిగి ఉండాలని తెలిపింది. ఈ మార్గదర్శకాలలో ఏదైనా ఉల్లంఘన జరిగితే వినియోగదారుల రక్షణ చట్టం 2019 ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.