పులివెందుల అంటే 1978 నుంచి వైఎస్సార్ కుటుంబం చేతిలోనే ఉంది. అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జగన్ను రాజీనామా చేయాలని షర్మిల పదే పదే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అసెంబ్లీకి గైర్హజరు కావాలని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె గట్టిగానే ఎండగడుతున్నారు. రానున్న నాలుగున్నరేళ్లు ఇదే తీరున సభకు హాజరు కాకుండా వైసీపీ అధినేత వ్యవహరిస్తే మాత్రం పులివెందులలో పాగా వేసేందుకు చెల్లెమ్మకు చాన్స్ దొరికినట్లే అని అంటున్నారు.