తూ. గో జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ప్రతిరోజు 30, 000 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె లారీ ట్రాన్స్‌పోర్ట్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇసుక సరఫరా విషయంలో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఇసుక సరఫరాపై ఆమె వారికి సూచనలు చేశారు.