రాజమండ్రిలో జరుగుతున్న భూ మాఫియాపై విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ మేరకు రెవెన్యూ మంత్రి సత్య ప్రసాద్‌కు లేఖ అందచేశారు. రాజమండ్రిలో 38 ఎకరాలలోని ప్లాట్లు భూమాఫియా చేతిలోకి వెళ్లాయని, దీనిలో వైసీపీ హస్తం ఉందన్నారు. దీనిపై నిజాలు నిగ్గు తేల్చాలన్నారు.