ఆదోని: రైల్వే ట్రాక్ వద్ద యువకుడి మృతదేహం

ఆదోని డివిజన్ పరిధిలోని నగరూర్, ఆస్పరి రైల్వేస్టేషన్ల మధ్యలో రైల్వే ట్రాక్ పక్కన మంగళవారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైందని రైల్వే పోలీసులు తెలిపారు. ఆదోనికి చెందిన షేక్ షాబీర్ (31) బేల్దార్ పని చేసుకోనే ఈ వ్యక్తి చనిపోయిన విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు తల్లిదండ్రులకు చేరవేశారు. రైలు నుంచి జారిపడ్డాడా, లేక రైలు ఢీకొని మృతి చెందాడా అనే విషయాలు విచారణలో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్