తన కోసం ఏపీ పోలీసులు గాలించడంపై స్పందిస్తూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ సంచలన వీడియో విడుదల చేశారు. పోలీసుల నోటీసులకు తాను ఏడవడం లేదని, వణికిపోవడం లేదని చెప్పారు. తాను ఏడాది క్రితం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల సంబంధిత వ్యక్తులకు కాకుండా.. ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆర్జీవీ ప్రశ్నించారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్లో ఉన్నందున విచారణకు రాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు.