సిరివెళ్ల మండల పరిధిలోని గోవింద పల్లెలో మండల వ్యవసాయాధికారి సుధాకర్ ఆధ్వర్యంలో వరి పంట కోత ప్రయోగం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ ఎన్ ప్రసాద్ రెడ్డి, డివై స్ఓ పర్యవేక్షణలో నిర్వహించారు. దిగుబడి 5x5 కొలతలతో 19.880 కేజీల వడ్లు రావడం జరిగింది అని, పచ్చి గడ్డి బరువు: 52.150 గ్రామ్లు వచ్చిందని మంగళవారం అన్నారు. ఏ ఎస్ ఓ, ఏ ఈ ఓ, వీఆర్వోలు నరసింహులు శ్రీరాములు, గ్రామ రైతులు, తదితరులు హాజరయ్యారు.