కొత్తపల్లి గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా జీవించాలి

60చూసినవారు
కొత్తపల్లి గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా జీవించాలి
గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా జీవించాలని కొత్తపల్లి ఎస్ఐ ఎం. కేశవ సూచించారు. మంగళవారం మండల పరిధిలోని నందికుంట గ్రామంలో రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాలు ఎల్లప్పుడు ప్రశాంతంగా ఉంటాయని అటువంటి గ్రామాల్లో ఎటువంటి గొడవలు, అల్లర్లు, ఘర్షణలకు చోటులేకుండా ప్రజలు జీవనం సాగించాలన్నారు. ప్రధాన కూడలీలలో, దేవాలయాలు మసీదులు వద్ద సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్