కోడుమూరు: ట్రూ అప్ చార్జీల వసూళ్లు వెంటనే ఆపాలి

కూటమి ప్రభుత్వం ట్రూ అప్ చార్జీల పేరుతో చేస్తున్న వసూళ్లను వెంటనే ఆపాలని సీపీఎం కోడుమూరు మండల కమిటీ నాయకులు రాజు డిమాండ్ చేశారు. మంగళవారం కోడుమూరులో వారు మాట్లాడారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే గోరుచుట్టుపై రోకటి పోటులా ప్రభుత్వం కరెంట్ చార్జీలను పెంచడం దారుణమన్నారు. ప్రజాసమస్యలపై ఈనెల 14న తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్