కనిగిరి: రక్తదానం చేసిన జడ్జి భరత్

కనిగిరి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా సీఐ ఖాజావలి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి హాజరైన కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి కే. భరత్ చంద్ర స్వయంగా రక్తదానం చేశారు. రక్తదానం ఒక గొప్ప కార్యక్రమమని, ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని జడ్జి తెలిపారు.

సంబంధిత పోస్ట్