విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ భవన్ ఎస్. ఈ కార్యాలయం వద్ద శుక్రవారం సిపిఎం పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హనీఫ్ మాట్లాడుతూ.. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, మరోవైపు కరువు, వరదలు వెంటాడుతున్నాయని తెలిపారు.