గుంతకల్లు: వరద బాధితులకు పరిహారం అందించాలని నిరసన

గుంతకల్లు తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ పార్టీ డివిజన్ కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం వరద బాధితులకు కొంతమందికే పరిహారం అందించారని, వేలాది కుటుంబాలకు పరిహారం అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వరద బాధితులకు పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్