గుత్తి ఆసుపత్రి లో మరమ్మతు పనులకు ప్రతిపాదనలు

గుత్తి ప్రభుత్వాసుపత్రిలో మరమ్మతు పనులు చేపట్టడానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్లప్ప చెప్పారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఆయన మాట్లాడారు. కిటికీలు, డోర్లు, బాత్రూములు మరమ్మతులతోపాటు పెయింటింగ్ ఇతరత్రా వాటి కొరకు మొత్తం రూ. 22 లక్షలు మంజూరు చేయాలని వైద్య శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామన్నారు.

సంబంధిత పోస్ట్