కళ్యాణదుర్గం: అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

కళ్యాణదుర్గం పట్టణంలో బుధవారం అన్న క్యాంటీన్ ను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు నుంచి కేవలం రూ. 5లకే టిఫిన్, భోజనం అందుతుందని తెలిపారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్