గోరంట్ల: ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి: మంత్రి

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. సోమవారం గోరంట్ల మండల కేంద్రంలోని మండల సమాఖ్య వెలుగు కార్యాలయంలో మంత్రి సవిత ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుండి అర్జీలను మంత్రి సవిత స్వీకరించారు. కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డిఓ సువర్ణ, పెనుకొండ డిఎస్పీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మారుతి, అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్