జన్వాడ ఫామ్ హౌస్‌లో పార్టీ కేసులో రాజ్ పాకాల విచారణ ముగిసింది. విజయ్ మద్దూరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా దాదాపు 7 గంటల పాటు ఆయనను మోకిల పోలీసులు ప్రశ్నించారు. విచారణ మధ్యలో జన్వాడ ఫామ్ హౌస్‌కు తీసుకెళ్లి సోదాలు చేశారు. గతంలో జరిగిన పార్టీలు, విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ రావడంపై పోలీసులు ఆరా తీశారు. సోదాలు ముగిసిన అనంతరం రాజ్ పాకాలను పోలీసులు తిరిగి మోకిల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.