ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు జల్ జీవన్ ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. 'ఈ శాఖ బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో జేజేఎంలో చేపట్టిన పనుల్లో లోపాలను గుర్తించాం. జల్ జీవన్ కింద గతంలో కొన్ని చోట్ల అసలు పనులే మొదలు కాలేదు. వీటిని సరిదిద్దుతూ పనులు వేగవంతం చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. జల్ జీవన్ మిషన్ సక్రమంగా చేపట్టడం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని ఇవ్వగలం' అని పవన్ కళ్యాణ్ అన్నారు.