నార్పల: బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి

నార్పల మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలు బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి శ్యామల తెలిపారు. బుధవారం ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల సొమ్ము బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ఎన్పిసిఐ లింక్ ఉండాలన్నారు. ఇంతవరకు బ్యాంకు ఖాతాలు లేని వారు కూడా బ్యాంకు, పోస్ట్ ఆఫీసులో కానీ వెంటనే నూతన ఖాతా నమోదు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్