ఉరవకొండ పట్టణంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో పట్టణంలోని ఆటో డ్రైవర్లతో ఎస్ఐ జనార్దన్ నాయుడు ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు అనుమానాస్పద స్థితి వ్యక్తులు కాని, కొత్తగా పట్టణంలోకి వచ్చి ఆటోలను ఎక్కితే వారి విషయం వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. పట్టణవాసులు వేరే ఊరికి వెళ్లేటప్పుడు ఇంటికి జాగ్రత్తగా తాళాలు వేసి పోలీసులకు తెలియజేయాలన్నారు.