108 వాహనాలను ప్రభుత్వమే నడపాలని 108 అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ సోమవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు చిత్తూరు కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ. ఇప్పటికే అన్ని శాఖల అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. నేడు ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపడుతున్నామన్నారు. తమ సమస్యలను పరిష్కరించుకుంటే 25 నుంచి 108 వాహనాలను నిలిపివేస్తామన్నారు.