దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మాధవధార, సీతన్నగార్డెన్స్ లో శ్రీ గాయత్రీదేవి, శ్రీ కనకమహాలక్ష్మి, శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త సనపల కీర్తి ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లతో మొదటి రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలి రోజు వేడుకలలో భాగంగా శ్రీ బాలత్రిపుర సుందరిదేవి గా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.