విజయవాడ జక్కంపూడి వరద ప్రాంతాల్లో గురువారం కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వరద బాధితులతో ప్రభుత్వం నుంచి నిత్యావసర సరకులు, ఆహారం, మెడిసిన్స్ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నష్ట పోయిన ప్రతి కుటుంబం డేటాని నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నాయి.