మణిపుర్ రాజధాని ఇంఫాల్ నడిబొడ్డున గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య నివాసానికి సమీపంలో గ్రెనేడ్ కలకలం రేపింది. ఇంఫాల్ లోని ఓ మహిళా కళాశాల గేట్ వద్ద సోమవారం ఓ గ్రెనేడ్ ను స్థానికులు గుర్తించారు. గవర్నర్ అధికార నివాసానికి కేవలం 200 మీటర్ల దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 'శ్రామికవర్గ విద్యార్థుల హక్కులను గౌరవించాలి' అంటూ అక్కడ ఓ నోట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.