పెంపుడు కుక్క ఆచూకీ చెబితే.. రూ.50వేల బహుమానం

అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పెంపుడు కుక్క తప్పిపోవడంతో ఢిల్లీకి చెందిన దీపయాన్ ఘోష్, కస్తూరి పాత్రా దంపతులు అల్లాడిపోయారు. దీంతో తమ కుక్క ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల బహుమతిని ఇస్తామని వెల్లడించారు. ఈ విషయాన్ని ప్లకార్డులపై రాసి చూపిస్తూ.. దిగిన ఫొటోలను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవలే దీపయాన్ ఘోష్ దంపతులు ఆగ్రా టూర్‌కు వెళ్లగా.. రెండు పెంపుడు కుక్కలను వెంట తీసుకెళ్లారు. ఆ సమయంలో ఓ కుక్క తప్పిపోయింది.

సంబంధిత పోస్ట్