హైదరాబాద్ తుకారాం గెట్ కు చెందిన స్థిరాస్తి వ్యాపారి రమేశ్ కుమార్ హత్యకు గురవ్వగా.. ఈ కేసులో ఆయన రెండో భార్య నిహారిక(29), మరో ఇద్దరు నిందితులు అరెస్టయ్యారు. నిహారిక తన ప్రియుడు రాణాతో కలిసి రమేశ్‌ను హైదరాబాద్ శివార్లలో కారులో కొట్టి చంపారని, ఆపై ఆమె మరో ప్రియుడు నిఖిల్ రెడ్డి సాయంతో కర్ణాటకలోని కాఫీ తోటలో శవాన్ని ముక్కలు చేసి కాల్చేశారని పోలీసులు తెలిపారు. రమేశ్ పేరిట ఉన్న రూ. కోట్ల ఆస్తి కోసం వారు ఈ హత్య చేశారన్నారు.