లోకేశ్వరం మండలంలో కురుస్తున్న వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారాయి. మండలంలోని మన్మధ్ గ్రామం నుంచి హవర్గ ఎక్స్ రోడ్డు వరకు రోడ్డు గుంతలతో అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల్లో నీళ్లు నిండి వుండడంతో ఎక్కడ గుంత ఉందో తెలియట్లేదని, గుంతల్లో పడి ప్రమాదం జరిగే అవకాశం ఉందని, అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరారు.