నిర్మల్: ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య

నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజుల్పేట్ కు చెందిన ఉజ్మాబేగం (31) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం ఉజ్మాబేగం మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆసుపత్రుల్లో వైద్యం చేయించినా నయం కాలేదు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతురాలి తల్లి రషీదా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్