ఢిల్లీ కొత్త సీఎం అతిషికి అధికారిక నివాసం కేటాయింపు

ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అతిషికి పీడబ్ల్యూడీ అధికారులు అధికారిక నివాసాన్ని కేటాయించారు. అతిషికి 6,ప్లాగ్ స్టాఫ్ రోడ్డులోని సివిల్ లైన్స్ నివాసాన్ని అధికారికంగా కేటాయించినట్లు పీడబ్ల్యూడీ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వెలువడిన 8 రోజుల్లోగా బంగ్లాకు సంబంధించిన అంగీకారపత్రాన్ని సీఎం సమర్పించాలని లేఖలో పీడబ్ల్యూడీ పేర్కొంది. ఇటీవల ఢిల్లీ సీఎం అధికార నివాసంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్