లోడ్ పెరిగిందంటూ ట్రాన్స్ఫార్మర్ల భారం అపార్ట్మెంట్ వాసులపై వేస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. 'కరెంట్ నిర్వహణ, సరఫరా చేతకాక ప్రజలను ఇబ్బంది పెట్టేలా రేవంత్ మరో తుగ్లక్ చర్య. ఒక్కో అపార్ట్మెంట్లో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం రూ. 3 లక్షలు కావాలి. మధ్యతరగతి కుటుంబాలపై ఇది భరించలేని భారమవుతుంది. లోడ్‌ను సరిగ్గా నిర్వర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కొత్తగా అవసరమైన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలి' అని డిమాండ్ చేశారు.