AP: అమరావతికి 10 ఏళ్ల నుంచి బీజేపీ కట్టుబడి ఉందని బీజీపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడ 39వ డివిజన్లోని లొల్లావారి వీధిలో ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె పాల్గొన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో పోలవరం పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు పోలేదని విమర్శించారు. తాజాగా పోలవరానికి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.12,500 కోట్లను కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు.