గుజరాత్లోని మొదసాలో జూన్ 16న షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ తన భర్తతో కలిసి బైక్పై వెళ్తోంది. ఆ సమయంలో ఆమెను ఓ ఆవు వెంబడించింది. బైక్ దిగిన ఆ మహిళ ఆవును కొట్టి బెదిరించే ప్రయత్నం చేసింది. అయితే ఆ ఆవు మహిళను కొంత దూరం తరిమింది. చివరికి కింద పడేసి మహిళపై దాడి చేసింది. ఆమెను భర్త చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.