యువతి దారుణం.. రీల్స్ కోసం పసిపాపతో చెలగాటం! (Video)

62చూసినవారు
రీల్స్, షార్ట్ వీడియోల కొందరు ఏ చేసేందుకైనా వెనకాడరని రుజువు చేసే ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఓ యువతి నెలల వయసున్న ఓ బాలుడిని ఎత్తుకుని షార్ట్ వీడియో చేసింది. ఇదిచాలదన్నట్టు ఓ చేత్తో బాలుడిని ఎత్తుకుని మరో చేత్తో సిగరెట్ తాగింది. పొగ ఘాటుకు చిన్నారి దగ్గడం ప్రారంభించాడు. యువతి మాత్రం తన మానాన తాను సిగరెట్ తాగుతూ వీడియోకు పోజులిచ్చింది. ఇది చూసి జనాలు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్