హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ప్రభాస్ అభిమానులు సందడి చేశారు. బుధవారం ఆయన పుట్టిన రోజు కావడంతో అర్ధరాత్రి ప్రభాస్ ఇంటికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా, అభిమానులు వాగ్వాదానికి దిగారు. అనంతరం ప్రభాస్‌ను కలవాలంటూ వారంతా రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు చెదరగొట్టారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.