కామారెడ్డి జిల్లాలో గర్భిణిపై దాడి చేసిన మాజీ ఎంపీటీసీ (వీడియో)

TG: కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాన్సువాడకు చెందిన నాలుగు నెల‌ల గ‌ర్భిణి రాజేశ్వరి, తన భర్త కలిసి న‌డుపుతున్న హోట‌ల్‌ను మూసివేయాలంటూ శనివారం మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్ దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో రాజేశ్వరికి తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్