దేవరకద్ర: ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం దమాగ్నాపూర్లో శుక్రవారం సాయంత్రం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ నిరుపేదల విద్యార్థుల ఉన్నత విద్య చదవడానికి ఈ పాఠశాలలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్