మహబూబ్ నగర్: రైతులకు మౌలికవసతులు కల్పించాలి

మహబూబ్ నగర్ జిల్లాలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతులకు మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. సోమవారం మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమే మాట్లాడుతూ. తేమయంత్రాలు, ఎలక్ట్రానిక్ కాంటాలు, పాడి డ్రయర్లు, టార్పాలిన్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సరిపడా సరఫరా చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్