మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో ఎంతోజియా పేరుతో కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆదివారం కళాశాలలో చదువుతున్న విద్యార్థులు 5 కి. మీ మారథాన్ రన్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వరకు రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాల్ న్యూట్రిషన్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్, ఫ్యాకల్టీ డాక్టర్ కిరణ్, విద్యార్థులు పాల్గొన్నారు.