గ్రామపంచాయతీలకు అవార్డులు ప్రధానం

జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే జి. జైపాల్ యాదవ్ అన్నారు. శనివారం కల్వకుర్తి మండల ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో నేషనల్ దీన్ దయాల్ ఉపాధ్యాయ పురస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లో భాగంగా పలు రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామపంచాయతీల సర్పంచ్, సెక్రటరీలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికాలు అందజేయడంతో పాటు శాలువాల తో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, స్థానిక ఎంపీపీ సామ మనోహర చెన్నకేశవ లు సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి. జైపాల్ యాదవ్ మాట్లాడుతూ గ్రామాలలో మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యంతో పాటు సర్పంచ్ , సెక్రెటరీ సమన్వయంతో పనిచేయాలన్నారు. దేశానికి పల్లెలు పట్టుకొమ్మలని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి అన్నారు. స్థానిక ఎంపీపీ సామ మనోహర మాట్లాడుతూ మండల పరిధిలోని 24 గ్రామపంచాయతీలకు అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొండూరు గోవర్ధన్ , కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సింగం విజయ్ గౌడ్ , కల్వకుర్తి మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు ఎముక జంగయ్య, డి ఎల్ పి ఓ జి పండరినాథ్, ఎంపీడీవో ఆంజనేయులు, ఎంపీఓ దేవేందర్, మండల కోఆప్షన్ సభ్యులు రుక్నుద్దీన్, ఎంపిటిసి శోభాశేఖర్ రెడ్డి , సెక్రటరీ ఇందిరా, ఆయా గ్రామపంచాయతీల సర్పంచులు, ఎంపిటిసిలు సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్