పెంట్లవెల్లి: విధులకు హాజరుకాని ఉపాధ్యాయుని సస్పెండ్ చేయాలి

పెంట్లవెల్లి మండల పరిధిలోని జటప్రోలు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఫిజికల్ సైన్స్ బోధించే వెంకటేశ్వర శెట్టి విధులకు రాకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఉపాధ్యాయుని పై చర్యలు తీసుకోవాలని నూతన ఎంఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఇమ్మానుయేల్ కి శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాయకులు ఎస్ తరుణ్, హనుమంతు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్