లంకాల: సంస్థాగతంగా బీజేపీని బలోపేతం చేస్తాం

మక్తల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి అన్నారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వంలో భాగంగా ఆయన నర్వ మండలం లంకల గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త 100 సభ్యత్వాలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్