కంటి వెలుగు కార్యక్రమంపై ఎంపీడీవో సమీక్ష

నారాయణపేట జిల్లా గుండుమల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో త్వరలో ప్రారంభం కానున్న కంటి వెలుగు ప్రోగ్రాం పై కోస్గి ఎంపీడీవో వెంకటయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల జనవరి 18 నుంచి మొదలవుతున్న కంటి వెలుగు కార్యక్రమం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఎక్కడెక్కడ శిబిరాలు ఏర్పాటు చేస్తారనే విషయాలను గురించి చర్చించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ కిష్టమ్మ శిబిరాల యొక్క సమాచారాన్ని, కార్యక్రమం యొక్క సూచనలను వివరించారు. తరువాత కంటి వెలుగు ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటయ్య, మెడికల్ ఆఫీసర్ కిష్టమ్మ, సూపర్వైజర్ మణిమాల, రామచందర్ జి, ఏఎన్ఎమ్స్, డాటా ఎంట్రీఆపరేటర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్