రైతులకు తక్షణమే రైతు భరోసా ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.పర్వతాలు డిమాండ్ చేశారు. బుధవారం కోడేరు మండలంలో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు 15000 అన్నమాట నేటికీ అమలు కాకపోవడంతో రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని అన్నారు.