నారాయణపేట జిల్లా కోస్గి మండలం చెన్నారం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కంటి వెలుగు మెడికల్ ఆఫీసర్ సుమన తో వివరాలు కనుకున్నారు. ఇంతవరకు పరిలీశించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షించాడానికి పడుతున్న సమయాన్ని ఎంతమందికి రీడింగ్ గ్లాసులు ఇచ్చారో అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు గ్రామం లో 68 రిడింగ్ గ్లాసులు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ కు పేర్కొన్నారు. దూరపు అద్దాలను వారి ఇంటికి చేరేవిధంగా వారి వివరాలను నమోదు చేసుకున్నామని తెలిపారు.