నష్టపరిహారం ఇవ్వాలని వినతి

ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలో అనేక మంది రైతుల పంట నష్టపోయారని, మట్టి ఇల్లు, రేకుల షెడ్లు కూలిపోయాయని వారికి నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కొండన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మరికల్ తహసీల్దార్ జామిల్ ఆలీ ని కలిసి వినతి పత్రం అందించారు. పంటలు నష్టపోయిన వారికి నష్టపరిహారం, ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్